హైదరాబాద్, జూలై 9: ఫిన్‌టెక్ కంపెనీ క్లియర్‌కు చెందిన అగ్రగామి ట్యాక్స్ ఫైలింగ్ క్లియర్ట్యాక్సీ..దేశంలో తొలిసారిగా కృత్రిమమేధస్సు(ఏఐ)తో పన్ను చెల్లించే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యను పరిష్కారించాలనే ఉద్దేశంతో ఈ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సరళతరమైన, ఒత్తిడి లేకుండా కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయవచ్చును. ఇందుకోసం ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, బంగ్లా వంటి ఏడు భాషల్లో ఈ సేవలు ప్రారంభించింది సంస్థ. వేతన జీవులు, గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, మొదటిసారిగా ఐటీ ఫైల్ చేసేవారు తమంతట తాము ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును. సంక్లిష్టమైన ట్యాక్స్ ఫారంలను డీకోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు…అలాగే మధ్యవర్తుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సంక్లిష్టమైన పన్నుల పరిభాషను సరళమైన భాషలోకి మార్చి సరైన ఐటీఆర్ ఫారంను సంస్థ అందిస్తున్నది. పన్ను చెల్లింపుదారులు కేవలం తమ పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఫారం 16, బ్రోకర్ స్టేట్మెంట్లను అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
7 కోట్లు దాటిన పన్ను చెల్లింపుదారులు
భారత్‌లో పన్ను చెల్లించేవారి సంఖ్య క్ర మంగా పెరుగుతున్నారు. జూలై 31, 2025 నాటికి 7.28 కోట్ల మంది రిటర్న్‌లు దాఖలుచేశారు. వీరిలో 56 శాతానికి పైగా రిటర్న్‌లు ఆఫ్‌లైన్‌లో, మధ్యవర్తుల సహాయంతోనే ప్రాసెసింగ్ చేశారు. వ్యవస్థాగతమైన సమస్యలు, భాషపరమైన ఇబ్బందులు తలెత్తడంతో మధ్యవర్తులపై ఆధారపడి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. రూ.1.25 లక్షల వరకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించేవారు ఐటీఆర్-1, ఐటీఆర్-4ని ఉపయోగించి ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సివుంటుంది. సంస్థ రూపొందించిన ఏఐ టెక్నాలజీ ఇందుకు సహాయకరంగా ఉంటుంది. దీంతో చాలా మంది ట్యాక్స్ఫైలర్లు సొంతంగా తొలిసారిగా ఏజెం ట్లు, సలహదారులు సహాయం లేకుండా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయవచ్చును.
టెక్స్ మెసేజ్ పంపినంత సులువుగా ట్యాక్స్ ఫైలింగ్‌ను కూడా మార్చాలనేది మా లక్ష్యం. క్లియర్‌ట్యాక్స్ ఏఐ అనేది దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించాం. డిజిటల్ అక్షరాస్యత అంతగా లేకపోవడం, భాషపరమైన అవరోధాలు, నిపుణుల సహాయం సరిగా అందకపోవడంలాంటి సవాళ్లను పరిష్కరించేలా ఈ నూతన టెక్నాలజీని రూపొందించడం జరిగింది. గిగ్ వర్కర్లు నుంచి చిన్న పట్టణాల్లో తొలిసారిగా ఫైలింగ్ చేస్తున్న వారి వరకు కోట్లాది మంది భారతీయులు తమకు నచ్చిన భాషలో ధీమాగా ఫైలింగ్ చేయడంలో ఈ టెక్నాలజీ తోడ్పాటు అందిస్తున్నాం. ఈ ఆవిష్కరణతో వచ్చే కొన్నేండ్లలో కోటి మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులను వ్యవస్థలోకి తీసుకురావాలని తమ లక్ష్యం – అర్చిత్ గుప్తా, క్లియర్‌ట్యాక్స్ ఫౌండర్, సీఈవో