న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన ఆస్టర్ డీఎం క్వాల్టీ కేర్..కేరళలోని తిరువనంతపురం వద్ద ఉన్న హాస్పిటల్‌ను రూ.134.4 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఈ హాస్పిటల్లో నూతన బ్లాక్‌ను నిర్మించడానికి కంపెనీ బోర్డు సమావేశమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఈ హాస్పిటల్లో కొత్తగా 184 పడకలు అందుబాటులోకి రానుండటంతో మొత్తం సంఖ్య 979 పడకలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం ఈ హాస్పిటల్ 795 పడకలతో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మే 2028 నాటికి పూర్తికాగలదని ఆశిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.