iQoo Z9s 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G), ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G) ఫోన్లను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో నడుస్తుండగా, , ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. రెండు ఫోన్లూ గ్రేటర్ నోయిడాలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో వీటిని తయారు చేశారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా సేల్స్ మొదలవుతాయి. వివో సబ్ బ్రాండ్ – ఐక్యూ తన ఐక్యూ జడ్9ఎస్, ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్లు రూ.25 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G), ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G) ఫోన్లలో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), సూపర్ నైట్ మోడ్ కలిగి ఉంటుంది. ఇది ఓఐఎస్ సాయంతో 4కే వీడియోలను రికార్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్హాన్స్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్ అదనంగా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్లామ్ బయాంట్ ఆరెంజ్, లుక్స్ మార్బుల్ పినిషెస్ రంగుల్లో లభిస్తుంది.
ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G), ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQoo Z9s Pro 5G) ఫోన్లు రెండూ 7.49 ఎంఎం బాడీ, 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఐక్యూ జడ్9ఎస్ 5జీ ఫోన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటే, ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 5500 పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది.