iQoo Neo 9s Pro+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ నియో 9ఎస్ ప్రో+ (iQoo Neo 9s Pro+) సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇందులో ఐక్యూ నియో 9ఎస్ ప్రో (iQoo Neo 9s Pro), ఐక్యూ నియో 9ఎస్ ప్రో+ (iQoo Neo 9s Pro+) ఫోన్లు ఉన్నాయి. ఇటీవలే భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ నియో9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ కొనసాగింపుగా ఐక్యూ నియో9ఎస్ ప్రో (iQoo Neo 9s Pro), ఐక్యూ నియో9ఎస్ ప్రో+ (iQoo Neo 9s Pro+) ఫోన్లు వస్తున్నాయి. వీటిలో ఐక్యూ నియో 9ఎస్ ప్రో+ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ, ఐక్యూ నియో 9ఎస్ ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 + చిప్ సెట్ కలిగి ఉంటాయి.
ఐక్యూ నియో 9ఎస్ ప్రో+ ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1.5 కే రిజొల్యూషన్ (2800 x 1260 పిక్సెల్స్)తోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. డీసీ డిమ్మింగ్, 2160 హెర్ట్జ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం) ఫీచర్ కూడా ఉంటుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటదీ ఫోన్. 16జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్, 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్‌గా ఉంటది.
ఈ ఏడాది ప్రారంభంలో ఐక్యూ నియో9 ప్రో రేర్ ప్యానెల్‌పై వెగాన్ లెదర్, టూ-టోన్ ఆప్షన్ లో వస్తున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో వస్తున్ నఈ ఫోన్ ధర రూ.34,999 పలుకుతుంది. ఐక్యూ నియో 8 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో 6.78 అంగుళాల అమోలెడ్ ప్యానెల్‌తో వస్తోంది. ప్రొప్రైటరీ చార్జర్‌తో 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.