iQOO 13 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ప్రీమియం ఫోన్ ఐక్యూ 13 (iQoo 13) మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్న రెండో స్మార్ట్ ఫోన్ ఇది. మూడు 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, 144 హెర్ట్జ్ రీప్రెష్ రేటుతోపాటు 6.82- అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ వివో ఫన్ టచ్ ఓఎస్ 15 స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
ఐక్యూ 13 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.54,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.59,999 లకు లభిస్తుంది. లెజెండ్, నార్డో గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఐక్యూ ఈ-స్టోర్, అమెజాన్ ద్వారా ఈ నెల 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐక్యూ 13 ఫోన్ల విక్రయాలు ప్రారంభం అవుతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్, వివో- ఐక్యూ పాత ఫోన్ల ఎక్స్చేంజ్ మీద రూ.5,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
ఐక్యూ 13 ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 15 వర్షన్‌పై పని చేస్తుంది. నాలుగేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 510 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.82 అంగుళాల 2కే (1,440 x 3,186 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఐక్యూ క్యూ2 (iQoo2) చిప్ జత చేశారు. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సర్ అండ్ ఓఐఎస్, ఈఐఎస్, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా విత్ శాంసంగ్ జేఎన్1 సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 816 సెన్సర్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
120వాట్ల ఫ్లాష్ చార్జి మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఐక్యూ13 (iQoo 13) వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ 3.2 జెన్ 1 టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, కలర్ టెంపరేచర్ సెన్సర్ ఉంటాయి.