iQOO 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) ఈ నెల మూడో తేదీన భారత్ మార్కెట్లో తన ప్రీమియం ఐక్యూ 13 (iQoo 13) ఫోన్ ఆవిష్కరించనున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తున్న ఐక్యూ 13 ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ మీద పని చేస్తుంది. నాలుగేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. ఐక్యూ 13 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.55 వేల లోపు ధరకు లభిస్తుందని తెలుస్తున్నది.
అక్టోబర్ నెలలో చైనాలో ఆవిష్కరించిన ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ ఫోన్ సుమారు రూ.61,400 (5199 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.47,200 (3999 చైనా యువాన్లు) పలుకుతుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ వేదికగా ఈ ఫోన్ విక్రయాలు సాగుతాయి. 2కే రిజొల్యూషన్, 144 హెర్ట్జ్ రీపరెష్ రేట్ తోపాటు క్యూ10 ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సర్, 50-మెగా పిక్సెల్ సోనీ పోర్ట్రైట్ సెన్సర్, 50 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.