LIC IPO | ఎల్ఐసీ బంఫరాఫర్.. ఐపీవోలో పాలసీదారులకు చాన్స్.. వారేం చేయాలంటే!
LIC IPO | త్వరలో ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి రానున్నది. పాలసీ దారులకు ఎల్ఐసీ 10 శాతం వాటాలు రిజర్వు చేసింది.

LIC IPO | ఐపీవోకు వెళ్లనున్న భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారులకు బంఫర్ ఆఫర్ ఇస్తోంది. ప్రతిపాదిత ఐపీవోలో పాల్గొనాలని భావించే పాలసీదారులు తమ పాన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ ఐపీవోలో 10 శాతం పాలసీ దారులకు రిజర్వ్ చేసింది. సంస్థ రికార్డుల్లో ఉన్న పాన్ నంబర్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఐపీవోలో పాల్గొనే చాన్స్ ఉంటుందని తెలిపింది.
అయితే, వారు డీమాట్ ఖాతా కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ డీమాట్ ఖాతా లేకపోతే వారు సొంతంగా ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ డీమాట్ ఖాతా తెరవడానికి అయ్యే ఖర్చును పాలసీదారులే భరించాలని పేర్కొంది.
దేశంలోకెల్లా అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ ప్రక్రియకు గత జూలైలో కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఐపీవో ద్వారా ఎంత వాటాను విక్రయించాలన్న విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి సారధ్యంలోని కమిటీ ఖరారు చేస్తుంది. ప్రతిపాదిత ఐపీవోకు వెళ్లడానికి వీలుగా ఫైనాన్స్ యాక్ట్-2022 ద్వారా ఎల్ఐసీ చట్టంలో ఇప్పటికే కేంద్రం సవరణలు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22లోనే ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ ఐపీవో కీలకం కానున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం, ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. రూ.లక్ష కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల విక్రయం ద్వారా, మిగతా రూ.75 వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సమీకరించనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- LIC IPO
- Policy holders
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

