Apple iOS 17.0.3 | ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్లలో ఓవర్ హీట్‌కు చెక్.. ఐఓఎస్ 17.0.3 అప్డేట్ విడుదల
Apple iOS 17.0.3 | ఐ-ఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లలో ఓవర్ హీట్ సమస్య పరిష్కారానికి ఆపిల్ ఐఓఎస్ 17.0.3 వర్షన్ రిలీజ్ చేసింది.
Apple iOS 17.0.3 | గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఆపిల్’ తన ఐ-ఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లలో ఓవర్ హీట్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఓఎస్ 17.0.3 (iOS 17.0.3) అప్ డేట్ విడుదల చేసింది. సెక్యూరిటీ అప్డేట్తోపాటు బగ్ సమస్య పరిష్కారానికి ఈ ఐఓఎస్ 17.0.3 అప్ డేట్ తెచ్చినట్లు తెలిపింది. ఐఓఎస్ 17లో ఉన్న బగ్ వల్లే కొందరు యూజర్లు వాడుతున్న ఐ-ఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లలో ఓవర్ హీట్ సమస్య తలెత్తిందని ఆపిల్ వెల్లడించింది. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ పెరగడం కూడా దీనికి కారణమని పేర్కొంది. ఇన్స్టాగ్రామ్, ఉబర్, అస్ఫాల్ట్ 9 వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం కూడా ఐఫోన్-15 ప్రో సిరీస్ ఫోన్లలో ఓవర్ హీట్ సమస్యకు మరో కారణం అని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐఓఎస్ 17.0.3 అప్ డేట్ వర్షన్ రిలీజ్ చేశామని వివరించింది.
ఐఓఎస్ 17.0.3 (iOS 17.0.3) డౌన్లోడ్.. అప్డేట్ చేసుకోవడం ఇలా..
* ఐ-ఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* తర్వాత జనరల్ ఆప్షన్ టాబ్ చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ అప్డేట్కి వెళ్లాలి.
* అక్కడ ఐఓఎస్ 17 (iOS 17) అప్ డేట్ ఆప్షన్ కనిపిస్తుంది.
* ఆ తర్వాత డౌన్ లోడ్ టాబ్‌పై పాస్ వర్డ్ నమోదు చేసి.. ఇన్ స్టాల్ చేసుకోవాలి.
* అటుపై కనిపించే టర్మ్స్ అండ్ కండీషన్స్ ఆప్షన్ ఆమోదించాలి.
* ఆ తర్వాత ఐఓఎస్ 17 అప్ డేట్ డౌన్ లోడ్ ప్రారంభం అవుతుంది.
* ఐఓఎస్ 17 అప్ డేట్ డౌన్ లోడ్ అయినత తర్వాత ఇన్ స్టా్ల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అటుపై అప్ డేట్ ఇన్ స్టా్ల్ అవుతుంది.
సెప్టెంబర్ 12న వండర్ లస్ట్ వేదికగా ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్ మార్కెట్లో ఐఫోన్-15 ప్రో విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,34,900, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,59,900లకు లభిస్తాయి.
READ MORE :
Apple-iPhone-15 Pro | ఐ-ఫోన్ 15 ప్రో వేడెక్కుతున్న మాట నిజమే.. ఆపిల్ అంగీకారం.. ఇవీ కారణాలు..!
iPhone 15 | వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

