హైదరాబాద్ సిటీబ్యూరో,మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ల్యాబ్ 32 యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేసింది టీ హబ్. స్టార్టప్‌లకు ఆర్థికంగా అవసరమైన సీడ్ ఫండ్‌ను సమకూర్చడంతోపాటు మార్కెటింగ్, నెట్‌వర్కింగ్‌కు ల్యాబ్ 32 సహకరిస్తుంది. 3 నెలలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో బీఎఫ్ఎస్ఐ, అగ్రిటెక్, సప్లయి చైన్ మేనేజ్మెంట్, మీడియా ఎంటర్టైన్మెంట్, ఫుడ్ టెక్, ఎంటర్ప్రైజ్ టెక్ వంటి అంశాల్లో స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు ల్యాబ్ 32 యాక్సిలేటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ https://bit.ly/3iHTk8wలో సంప్రదించాలని సూచించారు.