హైదరాబాద్, జూన్ 9: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం సేల్స్ఫోర్స్…2030 నాటికి దేశవ్యాప్తంగా పది లక్షల మంది ఏఐ ఆధారిత టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ..టెక్నాలజీ రంగంలో వస్తున్న వినూత్న మార్పులకు అనుగుణంగా ప్రతిభాపాటవాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.