చెన్నై, ఫిబ్రవరి 20: రిజర్వ్బ్యాంక్తోపాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత వృద్ధి అంచనాల్లో కోత పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఏక్యూట్ రేటింగ్’ చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదని సోమవారం తాజాగా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను 7శాతం అంచనావేస్తున్న ఏక్యూట్.. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం కారణంగా వృద్ధి అంచనాల్లో కోత పెట్టినట్టు వెల్లడించింది. గడిచిన కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేశీయ ఆర్థిక రంగం ఆశాజనక పనితీరు కనబరుస్తున్నదని తెలిపింది.