హైదరాబాద్, అక్టోబర్ 30: అంతర్జాతీయ పరుపుల విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సీలి..రాష్ట్రంలో తన తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్ జిల్లాలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 యూనిట్లలో ఇదే చిన్నది కావడం విశేషం. దేశీయంగా ప్రీమియం పరుపులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలి విడుత ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించినట్లు, భవిష్యత్తులో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు సీలే ఇంటర్నేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో సీన్ సీమన్ డెయర్ తెలిపారు.