న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశీయ ఎనర్జీ రంగంపై అంతర్జాతీయ సంస్థ బ్రూక్ఫీల్డ్ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాపార విస్తరణలోభాగంగా భారత్లో 10 గిగావాట్ల పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్టు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్, సీఈవో కోన్నర్ టెస్కీ తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధుల్లో 20 బిలియన్ డాలర్ల నిధులను అంతర్గత, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సేకరించినట్టు తెలిపారు.
దీంట్లోభాగంగా ఏపీలో 9 వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వీటిలో 3,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్, 5,500 మెగావాట్ల పవన విద్యుత్ యూనిట్లు ఉన్నాయి.