అధిక ధరలు.. వాటిని కట్టడి చేయడానికి రెపోరేట్ పెంచేసిన ఆర్బీఐ.. తదనుగుణంగా వడ్డీరేట్లు పెంచేసిన బ్యాంకులు. ఫలితంగా ఇండ్ల రుణాలు మొదలు వ్యక్తిగత రుణాలు.. ఆటోమొబైల్ రుణాలు, బిజినెస్ లోన్లు.. అన్ని రకాల రుణాలు పిరంగా మారాయి. గత మే నుంచి ఆర్బీఐ వివిధ సందర్భాల్లో 2.25 శాతం రెపోరేట్ పెరిగింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేశాయి. దీంఓ 20 ఏండ్లు అనుకున్న హోమ్ లోన్.. దాదాప 30 ఏండ్లకు పెరిగిపోతుంది. దీంతో ఇండ్ల రుణాలు తీసుకున్న వారు ముందుగా ఆ రుణం తీర్చేయడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే హోంలోన్తోపాటు పర్సనల్ రుణం తీసుకున్నవారు.. వడ్డీరేట్లు పెరగడంతో ముందుగా ఏ లోన్ చెల్లించాలన్న విషయమై తర్జన భర్జన పడుతుంటారు.
హోమ్ లోన్, పర్సనల్ లోన్లలో వ్యక్తిగత రుణంపైనే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ మీద 16 శాతం వడ్డీ వసూలు చేస్తూ ఉంటే,ఇంటి రుణంపై వడ్డీ 8.75 శాతం నుంచి మొదలవుతుంది. ఏ లోన్ మీదైనా వడ్డీ మినహాయింపులు ఉండవు. క్రెడిట్ కార్డుల మీద తీసుకున్న రుణాలకు అధిక వడ్డీ చెల్లించాల్సిందే. కనుక వెహికల్ లోన్, పర్సనల్ రుణం, క్రెడిట్ కార్డు రుణం త్వరత్వరగా చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
హోంలోన్ సుదీర్ఘ కాలం కొనసాగే రుణం. ఈ క్రమంలో వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు నమోదవుతాయి. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి రూ.2 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. అసలు చెల్లింపుపై రూ.1.50 లక్షల వరకు ఐటీ రిటర్న్స్ క్లయిమ్ చేయొచ్చు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థథు గాడిలో పెట్టడానికి ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడంతో ఇండ్ల రుణాలపై వడ్డీరేటు ఏడు శాఆనికి దిగి వచ్చినప్పుడు జనాలు బారీగా హోంలోన్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వడ్డీరేట్లు భారీగా పెరిగిపోవడంతో రుణ గ్రహీతలలో ఆందోళన పెరిగి పోయింది. అయినా, ఇండ్ల రుణాలచెల్లింపు విషయమై ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని హితవు చెప్పారు.
కనుక ఇండ్ల రుణాలు తీసుకున్న వారు తమ రుణ బకాయి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎంత లోన్ చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలనే విషయమై సమీక్షించుకుంటే భవిష్యత్లో ఇండ్ల రుణ బకాయి చెల్లింపునకు ప్లాన్ రూపొందించుకోవాలి. త్వరలో రిటైర్మెంట్ దశకు చేరుకున్న వారు అధిక మొత్తంలో టాక్స్ పే చేస్తుంటారు. ఈ తరుణంలో అసలు మొత్తం భారీగా చెల్లించాల్సి వస్తే పన్ను భారం కూడా ఎక్కువే ఉంటది. రుణ గడువు దగ్గర పడుతున్నందున వడ్డీలో తేడా ఉండక పోవచ్చు. కనుక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రుణ వాయిదాలు చెల్లిస్తే సరి. కొత్తగా రుణాలు తీసుకున్న వారు మాత్రం అడపాదడపా అసలులో కొంత మొత్తం చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.