న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటును పావుశాతం తగ్గించింది.
రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీరేటు 2.75 శాతానికి దిగొచ్చింది.