Jayanth Varma | న్యూఢిల్లీ, ఆగస్టు 24: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించడానికి రిజర్వుబ్యాంక్‌కు వీలు పడనున్నట్లు ద్రవ్యపరపతి సమీక్ష(ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ వెల్లడించారు. వచ్చే సమీక్షల్లో ఆర్బీఐ అర శాతం వడ్డీరేట్లను తగ్గిస్తాది అనుకుంటున్నా అని ఒక ప్రైవేట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించడానికి ఓటు వేయనున్నట్లు, మిగతా పావు శాతం ద్రవ్యోల్బణం, ఇతర పరిణామాలు కూడా కీలకం కానున్నయాన్నరు.
ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో గత కొన్ని నెలలుగా ధరల సూచీ తగ్గుతూ వస్తున్నదన్నారు. జూలై నెలకుగాను ధరల సూచీ 59 నెలల కనిష్ఠ స్థాయి 3.5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. అంతక్రితం ఏడాది 7.4 శాతంగా ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాలకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటున్నన్నదానిపై దేశీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం కానీ, ఫెడ్, గ్లోబల్ నిర్ణయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేమని స్పష్టంచేశారు.
తగ్గిన ఆహార పదార్థాల ధరలు
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఆహార పదార్థాల ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. దీంతో గడిచిన రెండు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయి కంటే అధికంగా వర్షాలు కురుస్తుండటం, ఖరీఫ్ సీజన్లో పంటల విస్తీర్ణం పెరగడంతో ధరలు దిగువముఖం పట్టాయి. భారత వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ..ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధమేఘాలు తగ్గిపోవడంతో భవిష్యత్తులో వృద్ధి ఆశాజనకంగా ఉంటుందన్నారు. గత మూడేండ్లుగా ఏడు శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్..భవిష్యత్తులో ఇంతే స్థాయిలో ఆశించవచ్చునని వర్మ వెల్లడించారు.
వడ్డీరేట్లు తగ్గిస్తాం: ఫెడ్ చైర్మన్ పావెల్
వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. ఫెడరల్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ కాన్సాస్ సిటీ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్లను ఎంతమేర తగ్గించాలనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, మున్ముందు విడుదలకానున్న స్థూల ఆర్థికాంశాలు, భవిష్యత్తు పరిణామాలు డిసైడ్ చేస్తాయన్నారు. 2022 మార్చి నుంచి 2023 జూలై వరకు వడ్డీరేట్లను 11 శాతం పెంచింది. దీంతో ఫెడ్ఖ వడ్డీరేటు 5.25-5.50 శాతానికి చేరుకున్నాయి.