న్యూఢిల్లీ, జూన్ 21: యునిట్ లింక్డ్ బీమా ప్లాన్ల(యులిప్)ను పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయవద్దని బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ బీమా సంస్థలకు సూచించింది. యులిప్‌లను పెట్టుబడి పథకాలుగా బీమా సంస్థలు ఇటీవల కాలంలో ప్రచారం చేస్తున్నాయని, ఇది సరైనది కాదని శుక్రవారం జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది.
మార్కెట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు సాంప్రదాయ ఎండోమెంట్ పాలసీలకంటే భిన్నంగా ఉన్నాయని, ఇవి రిస్క్‌లను కలిగివుంటాయని బీమా సంస్థలు ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించింది. అదేవిధంగా బోనస్‌తో కూడిన ఎండోమెంట్ పాలసీల బెనిఫిట్లో బోనస్‌లకు గ్యారెంటీ లేదని ముందుగానే చెప్పాలని సూచించింది. అన్ని ప్రకటనలు బీమా పాలసీకి, యాన్యుటీ ప్రొడక్ట్‌కు సంబంధించినవి మాత్రమే ప్రచారం చేయాలని పేర్కొంది.