Infosys | వలసలపై ఇన్ఫీ వివాదాస్పద రూల్.. సీన్లోకి కేంద్ర కార్మికశాఖ
Infosys | వలసల నియంత్రణకు జారీ చేసిన కొత్తరూల్పై 16లోపు రిప్లై ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ను కేంద్ర కార్మికశాఖ ఆదేశించింది.
Infosys | కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం కల్చర్ రావడం.. నిపుణులు, ప్రతిభావంతులకు గిరాకీ పెరగడం.. ఐటీ సంస్థల్లో వలసలు ( attrition ) పెరిగిపోయాయి. దిగ్గజ సంస్థలన్నింటికీ ఈ వలసల (attrition)తో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వలసలను నియంత్రించడానికి ఇన్ఫోసిస్ తీసుకొచ్చిన కొత్త రూల్.. వివాదాలకు కేంద్రం అవుతున్నది. తమ సంస్థలో పని చేసి రాజీనామా చేసిన ఉద్యోగులు ఇతర ఐటీ సంస్థల్లో ఏడాది పాటు చేరకూడదని ఇన్ఫోసిస్ తీసుకొచ్చిన నిబంధన విమర్శలకు తావిచ్చింది. తొలుత ఇది ఇన్పోసిస్, ఉద్యోగుల మధ్య వివాదంగా ఉంది.. తర్వాత కేంద్ర కార్మిక శాఖ రంగ ప్రవేశం చేసింది. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిటిషన్‌పై సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని 17న జరిగే సమావేశానికి ఇన్ఫోసిస్ యాజమాన్య ప్రతినిధులు హాజరు కావాలని కేంద్ర కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఏడాది పాటు తాము ఉద్యోగం చేయకుండా ఇన్ఫోసిస్ తమ హక్కులను కాల రాస్తున్నదని ఆరోపిస్తూ కేంద్ర కార్మికశాఖకు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఇన్ఫోసిస్‌ను కేంద్ర కార్మికశాఖ ఆదేశించింది. కానీ.. ఆ సమావేశానికి తాము హాజరు కాలేం అని.. అయినా నాసెంట్ నుంచి తమకు ఫిర్యాదు అందలేదని ఇన్పోసిస్ వాదించింది.
తొలి చర్చలకు ఇన్ఫోసిస్ గైర్హాజరు కావడంతో ఆ సంస్థ హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ క్రిష శంకర్‌కు కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్లేబర్ కమిషనర్ రెమిస్ తిరు లేఖ రాశారు. నాసెంట్ ఫిర్యాదులపై ఈ నెల 16కల్లా సమాధానం ఇవ్వాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. 17న జరిగే సమావేశానికి తప్పనిసరిగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు హాజరు కావాలని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

