Infosys | ఇన్ఫీకి భారీ షాక్.. అతిపెద్ద డీల్ లాస్.. ఎందుకిలా..?!
Infosys | ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా నిలంజయ్ రాయ్ వైదొలిగిన రెండు వారాల్లోనే సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సంస్థతో ఇటీవల చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగినట్లు శనివారం ఎక్స్చేంజీ ఫైలింగ్ లో తెలిపింది.
Infosys | భారత్ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’కు భారీ షాక్ తగిలింది. గత సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్‌తో అగ్రిమెంట్ చేసుకున్న ఓ గ్లోబల్ కంపెనీ.. ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. దీనివల్ల 150 కోట్ల డాలర్ల (సుమారు రూ.12 వేల కోట్లు) ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇన్ఫోసిస్ శనివారం ప్రకటించింది. డిజిటల్ సేవలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సర్వీసులు అందించేందుకు సదరు సంస్థతో ఇన్ఫీ గత సెప్టెంబర్ 14న 15 ఏండ్ల గడువుతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు అప్పట్లో తెలిపింది.
ఆరేండ్లుగా ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పని చేసిన నిలంజయన్ రాయ్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు వారాల్లో ఇన్ఫీ ఈ కాంట్రాక్ట్‌ను కోల్పోవడం గమనార్హం. ఇన్ఫీ భవితవ్యం పట్ల ఆందోళనతో గత 12 నెలల్లో దాదాపు ఎనిమిది మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్ బై చెప్పారు.
సాధారణంగా భారీ సంస్థలతో ఒప్పందం వల్ల సాఫ్ట్వేర్ సంస్థల ఆదాయం పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. కానీ ఏఐ బేస్డ్ గ్లోబల్ సంస్థ కాంట్రాక్టును కోల్పోవడం వల్ల ‘ఇన్ఫీ’పై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో చెప్పుకోదగినంత ఇన్పోసిస్ రెవెన్యూ గ్రోత్ సాధించలేదు. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ గైడెన్స్ లో కోత విధించింది. ఇంతకుముందు 1-3.5శాతం గ్రోత్ సాధిస్తుందని అంచనా వేయగా, తాజాగా దాన్ని 1-2.5 శాతానికి కుదించి వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

