Infosys | ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. సీఈఓ వేతనంలో భారీగా కోత.. ఎంతంటే..?!
Infosys | గతేడాది ఇన్ఫోసిస్ సీఈఓ వార్షిక వేతనంలో 29.3శాతం కోత విధించి రూ.56,4 కోట్లకు పరిమితం చేసింది సంస్థ యాజమాన్యం.
Infosys | దేశీయ ఐటీ జెయింట్ ‘ఇన్ఫోసిస్’ కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనంలో భారీ కోత విధించనున్నది. 2021-22తో పోలిస్తే 29.3 శాతం కోత విధించనున్నది. 2021-22లో 88 శాతం పెరిగిన సలీల్ పరేఖ్ వేతనం రూ.79.8 కోట్లు కాగా, 2022-23లో రూ.56.4 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ పనితీరు బలహీనంగా ఉండటంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ అంచనాలు మోస్తారుగా ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ఆయన వేతన పరిహారం తగ్గించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు సలీల్ పరేఖ్‌కు చెల్లిస్తున్న పరిహారం రూ.56.4 కోట్లలో ఆయన రెన్యూమరేషన్ రూ.30.6 కోట్లు కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఇన్ఫోసిస్ నుంచి వెళ్లిపోతున్న ప్రెసిడెంట్ మోహిత్ జోషి పరిహారం 2021-22తో పోలిస్తే 64.6 శాతం గ్రోత్తో రూ.34.8 కోట్ల నుంచి రూ.57.3 కోట్లకు పెరిగింది. ఏడాది ప్రారంభంలో మోహిత్ జోషి.. ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారు. గత మార్చి 11 నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఆయన సెలవులో ఉన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఇన్ఫోసిస్‌తో మోహిత్ జోషి అనుబంధం తెగిపోనున్నది.
ఇక ఉద్యోగుల సగటు మెడియన్ రెన్యూమరేషన్ (median remuneration) 2021-22తో పోలిస్తే 2022-23లో 9.9 శాతం పెరిగి రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెరిగింది. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న 124 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేతనం రూ.కోటిపైనే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

