Infinix Smart 9 HD | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ (Infinix Smart 9 HD) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 2023 డిసెంబర్లో ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ కొనసాగింపుగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ (Infinix Smart 9 HD) ఫోన్ వస్తోంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ (Infinix Smart 9 HD) ఫోన్ బ్యాటరీ హెల్త్, ఓవర్‌చార్జింగ్ నుంచి రక్షణ కల్పించేందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చార్జ్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో వస్తుంది. 5000ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ సింగిల్ చార్జింగ్ పూర్తయితే 14.5 గంటల వీడియో ప్లే బ్యాక్, 8.6 గంటల గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ (Infinix Smart 9 HD) ఫోన్ రూ.6,699లకు లభిస్తుంది. స్పెషల్ డే వన్ ఆఫర్ కింద రూ.6,199లకు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. మింట్ గ్రీన్, కోరల్ గోల్డ్, నియో టైటానియం, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.7 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, సౌండ్ బూస్ట్ టెక్నాలజీ, డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్‌తోపాటు డ్యుయల్ స్పీకర్లు ఉంటాయి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ (Infinix Smart 9 HD) ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ50 ప్రాసెసర్ విత్ 2.2 హెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. 6 జీబీ ర్యామ్ (3జీబీ ఫిజికల్ + 3 జీబీ వర్చువల్) విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది. క్వాడ్ ఎల్ఈడీ అండ్ జూమ్ ఫ్లాష్, కెమెరా ఐలాండ్‌తోపాటు 13- మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఎల్ఈడీ ఫ్లాష్, స్క్రీన్ ఫ్లాష్‌తోపాటు 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.