Infinix Smart-8 | భారత్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్-8 ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ - 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ – 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 50-మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరా విత్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. రెండు స్టోరేజీ వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్లతో వస్తున్న ఇన్ఫినిక్స్ స్మార్ట్-8 (Infinix Smart-8) ఫోన్ ఆండ్రాయిడ్ 13గో వర్షన్‌పై పని చేస్తుంది. మీడియా టెక్ హెలియో జీ36 ప్రాసెసర్‌తో నడుస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ ఫోన్ ధర రూ.6,749 పలుకుతుంది. ఈ నెల 15 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్-8 (Infinix Smart-8) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.6-అంగుళాల హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. గరిష్టంగా 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 8జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం తొలిసారి 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్లాష్ లైట్‌తో 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ -8 (Infinix Smart-8) ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీతోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఒకసారి చార్జింగ్ అయిన తర్వాత 39 గంటల ఫోన్ కాల్స్, 50 గంటల పాటు మ్యూజిక్, 36 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ పవర్ బ్యాకప్ ఉంటుంది. టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, గెలాక్సీ వైట్, రెయిన్ బో బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

