Infinix Note 40X 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Inifinix Note 40X 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ తో వస్తోంది. 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆపిల్ ఐ-ఫోన్లలో మాదదిరిగా స్క్రీన్ మీద నాచ్ ఫీచర్ జత చేశారు.
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Inifinix Note 40X 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు సొంతం చేసుకోవచ్చు. లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్ లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Inifinix Note 40X 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేటు, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080 x 2436 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. లో బ్యాటరీ ఇండికేషన్, చార్జింగ్ యానిమేషన్, ఫేస్ అన్ లాక్ వంటి డిస్ ప్లే సమాచారం కోసం డైనమిక్ పోర్ట్ ఫీచర్ జత చేశారు. 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్డ్ రివర్స్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Inifinix Note 40X 5G) ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోపాటు ఎన్ఎఫ్సీకి మద్దతుగా ఉంటుంది. డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్తోపాటు డ్యుయల్ స్పీకర్లు, బ్లూటూత్ 5.2, వై-ఫై 5.0 కనెక్టివిటీ ఉంటుంది.
Google Pixel 9 | పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లపై గూగుల్ ఆకర్షణీయ ఆఫర్లు.. ఇవీ డీటెయిల్స్..?!
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !