Infinix Note 30 VIP | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. మంగళవారం తన ఇన్ఫినిక్స్ నోట్ 30 వీఐపీ (Infinix Note 30 VIP) గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ నోట్ 30 (Infinix Note 30) ఫోన్ గత మే నెలలో మార్కెట్లోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ నోట్ 30 (Infinix Note 30) సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ 30, ఇన్ఫినిక్స్ నోట్ 30 ప్రో ఫోన్లు వస్తు్న్నాయి. నోట్ 30 5జీ ఫోన్.. భారత్ మార్కెట్లో ఈ నెల 14న మార్కెట్లోకి రానున్నది.
ఇన్ఫినిక్స్ నోట్ 30 వీఐపీ ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్సెట్, 68 వాట్ల వైర్డ్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కల 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తున్నది. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి తెలియరాలేదు.
ఇన్ఫినిక్స్ నోట్ 30 వీఐపీ (Infinix Note 30 VIP) ధర సుమారు రూ.24,600 (299 డాలర్లు) పలుకుతుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. గ్లేసియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంటది. 900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 విత్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ సెటప్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 30 వీఐపీ (Infinix Note 30 VIP) వస్తున్నది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, రెండు 2-మెగా పిక్సెల్ డెప్త్, మాక్రో సెన్సర్ కెమెరాలు ఉంటాయి. కెమెరా యూనిట్లు ఎల్ఈడీ ప్లాష్ ఆప్షన్ కూడా కలిగి ఉంటాయి. సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్ 5జీ, 4జీ ఓల్ట్, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, జేబీఎల్ ఆడియో స్పీకర్స్ కూడా ఉంటాయి.