మార్కెట్లో పలు నూతన మోడల్స్‌ను లాంఛ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌ను చేపట్టింది. నోట్ 11, నోట్ 11 ప్రొ పేరుతో నోట్ 11 సిరీస్‌ను ఇన్ఫినిక్స్ లాంఛ్ చేసింది. గిగాంటిక్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో జీ96 ప్రాసెసర్‌తో కూడిన నోట్ 11 సిరీస్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఇచ్చేలా 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ స్మార్ట్ఫోన్లను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రొ ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నోట్ 11 సెలెస్టియల్ స్నో, గ్లేసియర్ గ్రీన్, మిస్ట్ బ్లూ, గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉండగా నోట్ 11 ప్రొ హేజ్ గ్రీన్, మిస్ట్ బ్లూ, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. కాగా నోట్ 11 సిరీస్ భారత్ లాంఛ్‌పై ఇన్ఫినిక్స్ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. ఇక కెమెరా విషయానికి వస్తే నోట్ 11 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 30రెట్ల ఆప్టికల్ జూమ్, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.