70 పారిశ్రామిక వాడలు
రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు.
- ఐదేండ్లలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
- పారిశ్రామికాభివృద్ధికి రూ.4,037 కోట్ల నిధులు
- గత ఏడాదికన్నా రూ.1,000 కోట్లు అదనం
హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో 70 కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, కొత్త ఆహారశుద్ధి మండళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దాదాపు రూ.1000 కోట్ల వరకు ప్రోత్సాహకాలను పెంచడం విశేషం. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐపాస్ విప్లవాత్మక మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. గత ఎనిమిదిన్నరేండ్లలో 22 వేల పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు జారీకాగా, రూ.3.31 లక్షల కోట్ల వరకు రాష్ర్టానికి పెట్టుబడులొచ్చాయి. అంతేకాదు, వీటి ద్వారా రూ.22 లక్షల 36 వేల ఉద్యోగావకాశాలు లభించాయి.
పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థమైన పరిపాలన తదితర కారణాలవల్ల రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. అంతేకాదు, అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలివచ్చాయి. తెలంగాణలో ఫార్మాసిటీ, నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తదితర అనేక భారీ పారిశ్రామికవాడల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు సంబంధించి దండు మల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను 570 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
ఇందులో రూ.1200 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఎస్ఎంఈలు నెలకొల్పారు. ఇందులో 15 వేలమందికి ఉపాధి లభించనున్నది. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడానికి హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 7,150 ఎకరాల విస్తీర్ణంలో 21 కొత్త స్పెషల్ ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ జోన్లకు అవసరమైన అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలతోపాటు గోదాములు, కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నది.
‘పరిశ్రమలకు అంచనాలకుమించి నిధులు కేటాయించడం ఈ రంగానికి సరికొత్త ఊపునివ్వనున్నది. ఈ నిధుల్లో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలకు కనీసం 50 శాతం కేటాయించాలి. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి పారిశ్రామిక రంగానికి నిధుల కేటాయింపు గణనీయంగా పెంచుతున్నారు. ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన పారిశ్రామికవాడల ఏర్పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధికి దోహదం చేయనున్నది’
– గోపాల్‌రావు, టీఐఎఫ్ ఉపాధ్యక్షుడు
పరిశ్రమల శాఖ సాధించిన విజయాలు
- టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు ఇచ్చిన అనుమతులు – 22,110 యూనిట్లు
- ఎనిమిదిన్నరేండ్లలో ఐటీ, పరిశ్రమలకు వచ్చిన పెట్టుబడులు – రూ.3.31 లక్షల కోట్లు (40 బిలియన్ డాలర్లు)
- లభించిన ఉద్యోగాలు – 22.36 లక్షలు

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

