Indo Farm Equipment IPO | ట్రాక్టర్లు, క్రేన్లు, ఇతర వ్యవసాయ పరికరాలు తయారు చేసే సంస్థ ‘ఇండోఫామ్’ రూ.260 కోట్ల నిధుల సేకరణతో ఐపీఓకు వెళ్లింది. గురువారం ఐపీఓ ముగింపు గడువు పూర్తయ్యే సరికి ఇండో ఫామ్ షేర్ 227.57 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది. 84.70 లక్షల షేర్లకు 1,92,75,49,292 షేర్ల కోసం ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేశారు. ఇందులో నాన్ ఇన్ స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు 501.65 రెట్లు సబ్ స్క్రిప్షన్ బిడ్లు వేశారు. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషన్ బయ్యర్స్ 242.40 రెట్లు, రిటైల్ ఇండివిడ్యుయల్ ఇన్వెస్టర్లు 101.64 రెట్లు బిడ్లు దాఖలు చేశారు.
అంతకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.78 కోట్ల నిధులు సేకరించింది ఇండో ఫామ్. ప్రమోటర్ రణ్ బీర్ సింగ్ ఖాడ్వాలియాకు చెందిన 35 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా, 86 లక్షల షేర్లు తాజా ఇష్యూ జారీ ద్వారా ఇండో ఫామ్ ఐపీఓకు వెళ్లింది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాల కోసం ఖర్చు చేస్తామని ఇండో ఫామ్ తెలిపింది. ఐపీఓలో షేర్ల జారీ ధర రూ.204-215గా నిర్ణయించారు. అంటే రూ.260 కోట్ల విలువ గల ఐపీఓకు రూ.41,459 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.