హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు విమాన సేవలు ప్రారంభించింది ఇండిగో సంస్థ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 10.35 గంటలకు బయలుదేరిన 6ఈ7534 విమాన సర్వీసు గోండియాకు మధ్యాహ్నాం 12.35 గంటలకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఇండిగో బృందంతోపాటు జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఉన్నతాధికారులు ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో హైదరాబాద్ నుంచి దేశీయంగా 54 రూట్లకు, 14 అంతర్జాతీయంగా రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అయ్యాయి.