న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : విమానయాన దిగ్గజం ఇండిగో.. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.275 నుంచి రూ.10 వేల వరకు ఫ్యూయల్ చార్జీని వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. విమాన ఇంధనం ధరలు భగ్గుమనడంతో గతంలో విధించిన ఫ్యూయల్ చార్జీని మరింత పెంచినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ పెంపు ఈ నెల 2 నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలు పెంచిన రోజే ఇండిగో ఫ్యూయల్ చార్జీలను సవరించడం విశేషం. గత నెల 14న ఇండిగో..రూ.425 నుంచి రూ.2,300 వరకు ఫ్యూయల్ చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది.