Best Scooters | భారత్లో స్కూటర్లు.. 100సీసీ స్కూటర్లు చాలా పాపులర్.. దేశంలోని టూ వీలర్ మార్కెట్లో 100సీసీ నుంచి 110 సీసీ సెగ్మెంట్ స్కూటర్ల వాటా 60 శాతం. ఈ సెగ్మెంట్ లోని స్కూటర్లు అందుబాటు ధరలో ఉండటంతోపాటు మంచి మైలేజీ కూడా ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-5 స్కూటర్ల గురించి తెలుసుకుందాం..
భారత్ మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న స్కూటర్లలో హోండా యాక్టీవా 6జీ (Honda Activa 6G) ఒకటి. ఇది 109.51 సీసీ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్, సీవీటీతో ట్యూన్ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.73 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 8.90 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. హోండా యాక్టీవా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 6.3 లీటర్లు. ఇది లీటర్ పెట్రోల్ మీద 50 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో దీని ధర రూ.75,347 నుంచి రూ.81,348 పలుకుతుంది.
భారతీయ మహిళలు ప్రయాణించడానికి అత్యంత పాపులర్ స్కూటర్ హీరో ప్లీజర్ ప్లస్ (Hero Pleasure Plus). ఈ స్కూటర్ 110.9 సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్.. సీవీటీతో ట్యూన్ చేయబడి ఉంటుంది. హీరో ప్లీజర్ ప్లస్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 4.8 లీటర్లు ఉంటుంది. లీటర్ పెట్రోల్ మీద 50 కి.మీ మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,638 నుంచి రూ.78,538 పలుకుతుంది.
హోండా యాక్టీవా 6జీ, హీరో ప్లీజర్ ప్లస్ తర్వాత ఇండియన్లు కోరుకునే స్కూటర్ టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). ఇది 10.9.7 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, సీవీటీతో ట్యూన్ అవుతుంది. ఈ ఇంజిన్ 7.88 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 7.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఫ్యుయల్ ట్యాంక్ కెపాసిటీ ఆరు లీటర్లు. ఇది లీటర్ పెట్రోల్ మీద 50 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.72,190 నుంచి రూ.88,498 మధ్య పలుకుతుంది.
దేశంలోని బెస్ట్ స్కూటర్ల జాబితాలో తాజాగా చేరింది హీరో జూమ్ (Hero Zoom). ఈ స్కూటర్ 110.9 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, సీవీటీతో ట్యూన్ అయి ఉంటుంది. ఈ స్కూటర్ ఫ్యుయల్ టాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. లీటర్ పెట్రోల్ మీద 45 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇది రూ.69,099 నుంచి రూ.77,199 ధరల మధ్య అందుబాటులో ఉంది.
స్త్రీ, పురుషులంతా ప్రయాణానికి ప్రాధాన్యం ఇచ్చే స్కూటర్ హోండా డియో (Honda Dio). ఈ స్కూటర్ 109.51 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, సీవీటీతో ట్యూన్ అయి ఉంది. ఈ స్కూటర్ ఇంజిన్ 7.76 బీహెచ్పీ విద్యుత్, 9 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. దీని ఫ్యుయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. లీటర్ పెట్రోల్ మీద 55 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.68,625-రూ.72,626 మధ్య పలుకుతుంది.