Retail Inflation| రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత శాంతించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం నుంచి 5.10 శాతానికి దిగి వచ్చిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తెలిపింది. ఇది మూడు నెలల కనిష్టం. ఆర్బీఐ కీలక రెపోరేటు 6.5 శాతం కొనసాగిస్తూ వరుసగా ఆరోసారి నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకు ప్రకటించిన రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ద్రవ్యోల్బణం ఆధారిత ధరల సూచీ (సీపీఐ) డిసెంబర్ నెలలో 5.62 శాతం ఉంటే, 2024 జనవరిలో 6.52 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సీపీఐ 5.34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.92 శాతానికి దిగి వచ్చింది. సగటున జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.10 శాతంగా నమోదైంది. గత ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.83 శాతంతో గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం గత డిసెంబర్ నెలలో 9.53 శాతం ఉంటే, జనవరిలో 8.3 శాతం గా నమోదైంది.