ముంబై, జూలై 3 : విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత నెల చివరివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.654 బిలియన్ డాలర్లు తరిగిపోయి 666.933 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 150 మిలియన్ డాలర్లు తగ్గి 541.067 బిలియన్ డాలర్లుగా..గోల్డ్ రిజర్వులు 5.394 బిలియన్ డాలర్లు తగ్గి 102.536 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.