ముంబై, జూన్ 21: విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652. 895 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అంతక్రితం వారం రికార్డు స్థాయి 655.817 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. గత వారంలో విదేశీ కరెన్సీల రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.097 బిలియన్ డాలర్లు తగ్గి 574.24 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు కారణమని తెలిపింది.
యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం విదేశీ రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగా రం రిజర్వులు కూడా 1.015 బిలియన్ డాలర్లు తగ్గి 55.967 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఎస్డీఆర్లు 54 మిలియన్ డాలర్లు తగ్గి 18.107 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 245 మిలియన్ డాలర్లు పెరిగి 4.581 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.