Fiscal Deficit | మెరుగు పడిన ద్రవ్యలోటు.. 2023-24లో ఎంతంటే..?!
Fiscal Deficit | గత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.16.54 లక్షల కోట్లకు పడిపోయింది. బడ్జెట్ అంచనా ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
Fiscal Deficit | గత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.16.54 లక్షల కోట్లకు పడిపోయింది. బడ్జెట్ అంచనా ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు. దీంతో బడ్జెట్ టార్గెట్‌కు వ్యత్యాసం 95.3 శాతానికి చేరుకున్నది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 5.8 శాతం నుంచి 5.6 శాతానికి దిగి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంచనా కంటే ఎక్కువగా రూ.23.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని కంప్ట్రోలర్ అకౌంట్స్ జనరల్ (కాగ్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సర లక్ష్యాల్లో 100.1 శాతం అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చులు రూ.44.43 లక్షల కోట్లు (అంచనా వ్యయంలో 99 శాతం) అని వెల్లడించారు.
మౌలిక వసతుల ప్రాజెక్టులపై రూ.9.49 లక్షల కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ద్రవ్యలోటు రూ.2.1 లక్షల కోట్లు (పూర్తి సంవత్సర లక్ష్యంలో 12.5 శాతం) గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనాలను 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.1 శాతానికి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం దిగువకు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

