హైదరాబాద్, అక్టోబర్ 1: దేశంలో తొలి ఆర్గానిక్ ఐస్‌క్రీం బ్రాండ్ ఐస్‌బర్గ్ విస్తరణ బాట పట్టింది. వచ్చే రెండేండ్లకాలంలో మరో 25 అవుట్లెట్లను తెరువాలనుకుంటున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో సుహాస్ శెట్టి తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తన 73వ రిటైల్ అవుట్‌లెట్‌ను దసరా పండుగ సీజన్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న రిటైల్ అవుట్లెట్లలో 64 ఫ్రాంచైజ్ స్టోర్లు కాగా, 8 సొంతంగా అవుట్లెట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేండ్లకాలంలో మరో 25 సొంత అవుట్లెట్లను తెరువాలనుకుంటున్నట్లు, వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 10, మిగతా 15 స్టోర్లను తెలంగాణతోపాటు ఏపీల్లోనూ నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.14 కోట్లుగా నమోదైన టర్నోవర్, 2025-26 నాటికి రూ.100 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.