న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కీలక రంగాలు నెమ్మదించాయి. నవంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4.3 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 7.9 శాతంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్లు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కానీ, అక్టోబర్ నెలలో నమోదైన 3.7 శాతంతో పోలిస్తే మాత్రం పెరిగింది. ఈ నెలలో క్రూడాయిల్, సహజవాయువు రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే మొత్తం కీలక రంగాలపై ప్రభావం చూపిందని పేర్కొంది.
రూపీ ఆగమాగం
ముంబై, డిసెంబర్ 31: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2024లో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3 శాతం క్షీణించింది. ఇక సంవత్సరపు ఆఖరి రోజునా నిరాశపరిచింది. మంగళవారం మరో 12 పైసలు కోల్పోయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 85.64 వద్దకు దిగజారింది. కాగా, 2023 డిసెంబర్ 29న 83.16 వద్ద రూపాయి మారకం విలువ ముగిసింది. దీంతో ఈ ఏడాది కాలంలో రూ.2.48 పైసలు పతనమైనైట్టెంది.