గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 00:18:25

అమెరికాలో భారత టెక్కీ అరెస్టు

అమెరికాలో భారత టెక్కీ అరెస్టు

  • నకిలీ పత్రాలతో రూ.41 కోట్ల రుణాలకు దరఖాస్తు చేసినట్టు ఆరోపణ

బెంగళూరు, జూలై 25: భారత్‌కు చెందిన ముకుంద్‌ మోహన్‌ అనే టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ను గురువారం అమెరికాలో అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో అక్రమంగా 5.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41 కోట్ల) కొవిడ్‌-19 సహాయ నిధుల కోసం దరఖాస్తు చేశారని, ఈ రుణాల్లో కొంత మొత్తాన్ని తన వ్యక్తిగత రాబిన్‌హుడ్‌ బ్రోకరేజీ ఖాతాకు తరలించారని మోహన్‌పై ఆరోపణలు రావడం ఇందుకు కారణం. కరోనా సంక్షోభంతో కుదేలైన వ్యాపార సంస్థలను ఆదుకొనేందుకు అమెరికాలో ప్రవేశపెట్టిన పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌ (పీపీపీ) కింద మోహన్‌ తన ఆధ్వర్యంలోని ఆరు కంపెనీల కోసం ఎనిమిది రుణాలకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తున్నది.

ఈ ఆరు కంపెనీల్లో కనీసం ఒక్క ఉద్యోగి కూడా పనిచేయడం లేదని, ఈ కంపెనీల్లో కొన్ని అసలు వ్యాపారమే నిర్వహించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైసూర్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను అభ్యసించిన మోహన్‌ పారిశ్రామికవేత్తగా మారడానికి ముందు అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశారు. 2008లో అమెరికా నుంచి వచ్చిన మోహన్‌.. బెంగళూరులో సొంతగా ఓ వెంచర్‌ను ప్రారంభించడంతోపాటు మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో అప్పుడే ప్రారంభమైన ఓ స్టార్టప్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌కు సారథ్యం వహించారు.  


logo