Vishal Garg | గతవారం జామ్ మీటింగ్ కాల్‌లోనే 900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన బెటర్ డాట్‌కామ్ సీఈవో భారత సంతతికి చెందిన విశాల్గార్డ్ వార్తల్లో మళ్లీ పతాక శీర్షికలకెక్కారు. తన తప్పిదాన్ని తెలుసుకున్న విశాల్ గార్డ్.. తక్షణం 900 మంది ఉద్యోగుల ఉద్వాసన నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత గతవారం విశాల్ గార్డ్.. ఈ మేరకు ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు.
తర్వాత కంపెనీ ఉద్యోగులకు బెటర్ డాట్‌కామ్ వైస్‌ప్రెసిడెంట్ పేరిట ఈ-మెయిల్ వచ్చింది. సంస్థ నాయకత్వం, సంస్థల్లో సంస్కృతి సంప్రదాయాలపై అంచనా వేయడానికి ఓ సంస్థను అపాయింట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణం విశాల్ గార్గ్ పక్కకు తప్పుకుంటారు. ఈ ఇంటరీం పీరియడ్‌లో సీఎఫ్‌వో కెవిన్ ర్యాన్ రోజువారీ నిర్ణయాలు తీసుకుంటారని కంపెనీ తన ఈ మెయిల్ ప్రకటనలో తెలిపింది.
గతవారం జూమ్ వీడియో కాల్లో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి విశాల్ గార్గ్ మాట్లాడుతూ.. ఒకవేళ మీరు ఈ కాల్లో పాల్గొంటూ ఉంటే మీరు అన్‌లక్కీ.. మీ ఉద్యోగం పోయింది. తక్షణం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని అని చెప్పడంతో ఆ వీడియో వైరలైంది. కార్పొరేట్ ప్రముఖులంతా ఈ ఘటనను ఖండించారు. అయితే ఉద్యోగులు కేవలం ప్రతి రోజూ రెండు గంటలే పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కనీసం 250 మందిని తొలగించక తప్పదని విశాల్ గార్గ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది.