హైదరాబాద్, నవంబర్ 6 : ఎన్సీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను కంపెనీ రూ.155 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.163 కోట్లతో పోలిస్తే 5 శాతం తగ్గింది.
అలాగే కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 12.6 శాతం తగ్గి రూ.4,543 కోట్లకు పరిమితమైంది.