Remittance | న్యూఢిల్లీ, జూన్ 26: రెమిటెన్స్‌లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌లోకి 107 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు వచ్చాయి. వరుసగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించడం ఇది రెండోసారి. విదేశాల్లో విధులు నిర్వహిస్తున్నవారు తమ సంపదను తమ కుటుంబీలకు పంపడాన్ని రెమిటెన్స్‌గా వ్యవహరిస్తారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు కలుపుకొని వచ్చిన 54 బిలియన్ డాలర్ల కంటే రెమిటెన్స్‌లు రెండు రెట్లు అధికం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 119 మిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్‌కు వచ్చిన రెమిటెన్స్‌లో 23 శాతంతో అమెరికా తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి.