డిసెంబర్‌కల్లా డిజిటల్ రూపీ

- రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: భారత్ తన స్వంత డిజిటల్ కరెన్సీని త్వరలో తీసుకురానుంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఇండియాలో డిజిటల్ రూపీ ట్రయిల్స్ ప్రారంభిస్తామని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. సెంట్రల్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ ఆన్లైన్లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ ఒక అంగ్లఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ అనేది పూర్తిగా కొత్త సాధనం అయినందున, రిజర్వ్‌బ్యాంక్ చాలా జాగురూకతతో వ్యవహరిస్తుందన్నారు. డిజిటల్ కరెన్సీ సెక్యూరిటీ, ద్రవ్య విధానంపై దీని ప్రభావం, చెలామణీలో ఉన్న నగదుపై డిజిటల్ రూపీ ప్రభావం వంటి అంశాలన్నింటినీ పరిశీలించి, ఈ సంవత్సరాంతానికల్లా తాము డిజిటల్ కరెన్సీ ట్రయిల్స్ మొదలుపెడతామని శక్తికాంత దాస్ వివరించారు. ఈ కొత్త కరెన్సీకి ఒక కేంద్రీకృత లెడ్జర్‌ను ఉపయోగించాలా లేక బహుళ భాగస్వాములు కలిగిన డిజిటల్ డేటాబేస్‌ను నిర్వహించాలా అనే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెంట్రలైజ్డ్ లెడ్జర్ అయితే పూర్తిగా ఆర్బీఐ నిర్వహిస్తుంది. క్రిప్టోకరెన్సీలకు ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, నగదు వాడకం తగ్గడం వంటి కారణాలతో ఇప్పటికే యూకే, చైనా, యూరప్‌లు డిజిటల్ కరెన్సీల్ని వినియోగంలోకి తెచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాయి.
వడ్డీ రేట్లు హఠాత్తుగా పెంచం
ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో హఠాత్తుగా వడ్డీ రేట్లు పెంచబోమని ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చారు. పరిస్థితిని గమనిస్తున్నామని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అంటూ ‘ఇంకా తగిన సమయం రాలేదని మేం భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. హఠాత్ రేట్ల పెంపుతో మార్కెట్లను ఆశ్చర్యానికిగానీ, షాక్‌కుగానీ గురిచేయబోమన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని, వృద్ధిబాటలో కొనసాగితేనే విధాన మార్పునకు అది సరైన సమయమవుతుందని ఆయన చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

