Rafale M Jets | భారత నావికాదళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు.. మెగా డీల్‌పై సంతకాలు చేసిన ఇరు దేశాలు
Rafale M Jets | భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
Rafale M Jets | భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల (Rafale Marine fighter aircraft) కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ (France) దేశంతో భారత్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఒప్పందంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ భారీ ఒప్పందం విలువ 7.6 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.64,000 కోట్లన్నమాట.
ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, నాలుగు టు సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రానున్నాయి. దీంతోపాటు వీటి నిర్వహణ, స్పేర్లు, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు సకాలంలో పూర్తయ్యేలా ఫ్రాన్స్ ప్రభుత్వమే చూసుకుంటుంది. వాయుదళ శక్తిని పటిష్టం చేసే లక్ష్యంతో రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. శక్తివంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండే రఫేల్ యుద్ధ విమానాలు భారత నౌకాదళ పోరాట శక్తిని బలోపేతం చేయనున్నాయి. నాలుగేళ్లలో రఫేల్ యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఒప్పందం ప్రకారం.. తొలిబ్యాచ్ 2029లో రావొచ్చని.. 2031 నాటికి మొత్తం చేతికొచ్చే అవకాశాలున్నాయి.
Also Read..
Bank accounts | మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్నాయా.. అయితే ఈ నష్టాలు భరించాల్సిందే..!
Gold | అక్షయ తృతీయ ఆఫర్లు.. నగల కొనుగోళ్లపై కస్టమర్లకు ఇస్తున్న జ్యువెల్లర్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

