Hunter 350 | భారత్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ పాపులర్ మోడల్ అయిన హంటర్ 350 అప్డేట్ వెర్షన్‌ను భారత్‌లో రిలీజ్ చేసింది. ముంబయి, ఢిల్లీల్లో ‘హంటర్స్హుడ్’ ఫెస్టివిల్ నిర్వహించి.. హంటర్ 350 బైక్‌ని లాంచ్ చేసింది. ఈ బైక్ రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ రంగుల్లో అందుబాటులో ఉండనున్నది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో పలు మార్పులు చేసింది. మెరుగైన రైడింగ్ కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సీ యూఎస్బీ సపోర్ట్ అందించింది.
గ్రౌండ్ క్లియరెన్స్‌ని 10 ఎంఎంకి పెంచింది. అలాగే, రియర్‌లో సస్పెన్షన్‌లో సైతం మార్పులు చేసింది. దాంతో పాటు సీట్ కంఫర్ట్ ఉండేలా మార్పులు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ రేంజ్లో స్లిప్పర్-అసిస్ట్ క్లచ్ ఉన్న తొలి బైక్ ఇదే కావడం విశేషం. అయితే, కంపెనీ ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్లోని 349సీసీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, జే సిరీస్ ఇంజిన్‌ను యధాతథంగా కొనసాగించింది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానున్నది.
20.2 బీహెచ్పీ పవర్ వద్ద 27 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేయనున్నది. ఇక ఈ బైక్ మూడు వేరియంట్లలో అందబాటులో ఉండనున్నది. ఫ్యాక్టరీ బ్లాక్ ధర రూ.1,49,900గా నిర్ణయించింది. రియో వైట్, డాపర్ గ్రే వేరియంట్ రూ.1,76,750కి అందుబాటులో ఉంటుంది. ఇక టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ వేరియంట్ బైక్ రూ.1,81,750గా తెలిపింది. అయితే, ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలు (చెన్నై) మాత్రమే. ఈ హంటర్ 350 బైక్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని.. త్వరలోనే బైక్‌ల డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.