Bank accounts : చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు (Bank accounts) ఉంటాయి. అయితే వాటిలో ఒకటి లేదా రెండు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. మిగతావాటిని నిరుపయోగంగా వదిలేస్తారు. ఇలా బ్యాంకు ఖాతాను నిరుపయోగంగా వదిలేయడంవల్ల కొన్ని నష్టాలు భరించాల్సి వస్తుంది. మరి బ్యాంకు ఖాతాను ఉపయోగించకుండా వదిలేయడంవల్ల వచ్చే ఆ నష్టాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంకులో మనకు ఒక అకౌంట్ ఉందంటే అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే వాటిపై బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. చార్జీలు చెల్లించకపోతే ఖాతా మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్తుంది. ఆ తర్వాత ఆ బ్యాంకు ఖాతాను ఉపయోగించి లావాదేవీలు చేయాలంటే ముందుగా మైనస్ బ్యాలెన్స్‌ను క్లియర్ చేయాల్సిందే.
బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ క్రమంగా మాయమవుతుంది. ఉదాహరణకు మీకు ఓ ఐదు ఖాతాలు ఉన్నాయనుకుంటే.. మీరు ఎన్ని ఖాతాలను ఉపయోగించకుండా వదిలేస్తారో అన్ని ఖాతాల్లో ఉన్న నగదు చార్జీల రూపంలో క్రమంగా మాయమవుతుంది. కాబట్టి ఉపయోగంలో లేని ఖాతాలు ఉంటే వెంటనే క్లోజ్ చేసుకోవడం ఉత్తమం.
టెక్నాలజీ పెరుగుతున్న వేళ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. మీరు మీ ఖాతాను ఎక్కువ కాలం ఉపయోగించకుండా ఉంటే.. వాటిని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. దాంతో మీరు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ ఖాతాను ఉపయోగించకపోతే కనీసం అప్పుడప్పుడైనా చెక్ చేస్తుండాలి. వద్దు అనుకుంటే క్లోజ్ చేయాలి.
బ్యాంకు అకౌంట్‌ను ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న బ్యాలెన్స్ చార్జీల రూపంలో తరిగిపోతుంది. ఆ తర్వాత కూడా నిరుపయోగంగా ఉంటే మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్తుంది. మైనస్ బ్యాలెన్స్ అంటే మనం బ్యాంకుకు అప్పు ఉన్నామని అర్థం. కాబట్టి అకౌంట్ మైనస్‌లోకి వెళ్తే.. మీ సిబిల్‌పై ప్రభావం పడుతుంది. అలా జరగవద్దంటే ఉపయోగంలో లేని ఖాతాలను వెంటనే క్లోజ్ చేయాలి.