ముంబై, జూన్ 22: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను విదేశీ మారకం నిల్వలు 30.3 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది పెరిగిన 99.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులు కారణంగా 17.2 బిలియన్ డాలర్ల మేర తగ్గినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.