న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేండ్లలో భారీగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,780కి పెరిగిందని, ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్రి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఖరీదైనవిగా మారాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 2020లో చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.2,000గా ఉన్నది. గతేడాది నుంచి ఇసుక, ఇటుక, కలప, రాగి, అల్యుమినియం వంటి నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ…కూలీల కోసం పెట్టే ఖర్చు 25 శాతం పెరిగిందని కొలియర్స్ తెలిపింది.