ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు

- ద్వైమాసిక ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం
- కీలక వడ్డీరేట్లు యథాతథం
ముంబై, అక్టోబర్ 8: డిజిటల్ లావాదేవీలకు ఊతమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా జరిగే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఇది రూ.2 లక్షలుగానే ఉన్నది. మూడు రోజులపాటు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష శుక్రవారం ముగిసింది. ఈ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ నిర్ణయాలను మీడియాకు వివరిస్తూ ఐఎంపీఎస్ పరిమితిని పెంచుతున్నట్లు చెప్పారు. ఆఫ్లైన్లోనూ రిటైల్ డిజిటల్ చెల్లింపులు కొనసాగేలా కృషి చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే వరుసగా 8వసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు దాస్ తెలిపారు. రెపో 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతంగా ఉన్నది. మరోవైపు కరోనాతో వచ్చిపడిన ఆర్థిక ఇబ్బందుల మధ్య రాష్ర్టాలకు ఊరటనిస్తూ గతంలో కల్పించిన అన్ని రుణ సదుపాయాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా కొనసాగిస్తామని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఐఎంపీఎస్ అంటే?
ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ అనేది దేశంలో ఓ ఇన్స్టంట్ పేమెంట్ ఇంటర్-బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ బదిలీ వ్యవస్థ. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా ఐఎంపీఎస్ సేవలు నిరంతరం జరుగుతాయి. బ్యాంక్ సెలవు దినాల్లోనూ ఈ సర్వీస్ పనిచేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

