న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : పన్ను చెల్లింపుదారులు మరింత సులభతరంగా తమ పన్నులను చెల్లించేందుకు తమ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో ‘ఈ-పే ట్యాక్స్’ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను శాఖ. పన్ను బాధ్యతలను నెరవేచ్చడానికి, సమర్థవంతమైన, అవాంతరాలు లేకుండా పన్ను చెల్లించేందుకు వీలు పడనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. పన్నులను చెల్లించడానికి బ్యాంకుల వద్ద క్యూ లైన్లను నివారించాలనే ఉద్దేశంతో ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.