Income Tax | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌కు సమర్పించారు. బడ్జెట్లో కీలకమైన ఆదాయం పన్ను శ్లాబ్‌ల విషయమై మధ్య తరగతి వర్గానికి కాస్త రిలీఫ్ కల్పించారు. రూ.4 లక్షల వరకూ ఆదాయం పన్ను ప్రాథమిక మినహాయింపు (Income Tax Basic Exemption) కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానం కింద రూ.3 లక్షల వరకూ కనీస పన్ను మినహాయింపు కల్పించారు నిర్మలా సీతారామన్.
2023-24లో నూతన ఆదాయం పన్ను విధానం ద్వారా కనీస పన్ను మినహాయింపు రూ.2.5లక్షలకే పరిమితం చేశారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దాన్ని రూ.3 లక్షలకు పెంచారు నిర్మలా సీతారామన్. వివిధ పన్ను పొదుపు పథకాలతో కలిసి ఉన్న పాత ఆదాయం పన్ను విధానంలో చివరిగా 2014 లో రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు మాత్రమే కనీస పన్ను మినహాయింపు పరిమితి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
కనీస పన్ను మినహాయింపు పరిమితికి మించి ఆదాయం పెరిగితే సదరు పన్ను చెల్లింపుదారులు కనీస శ్లాబ్ ఆదాయం పన్ను చెల్లించాల్సిందే. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో తప్ప.. స్థూల పన్ను ఆధారిత ఆదాయం (Gross Taxable Income).. కొత్తగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కనీస పరిమితిని దాటినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ప్రతి పన్ను చెల్లింపుదారుడికి సంబంధిత ఆర్థిక సంవత్సరంలో తాను ఎంచుకునే ఆదాయం పన్ను విధానాన్ని బట్టి కనీస పన్ను మినహాయింపు లభిస్తుంది. నూతన పన్ను విధానాన్ని ఎంచుకుంటే వయస్సుతో సంబంధం లేకుండా రూ.3 లక్షల వరకు మాత్రమే కనీస పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఒకవేళ, పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పాత ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. సంబంధిత వ్యక్తి వయస్సును బట్టి పన్ను మినహాయింపు లభిస్తుంది. సదరు వ్యక్తి వయస్సు 60 ఏండ్లలోపు అయితే పాత ఆదాయం పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఒకవేళ, పన్ను చెల్లింపుదారుడు 60 ఏండ్లు గానీ, 80 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉంటే సీనియర్ సిటిజన్‌గా రూ.3 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందుతారు. 80 ఏండ్లకు పైగా వయస్సు గల సూపర్ సీనియర్ సిటిజన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందొచ్చు.
ప్రస్తుతం నూతన ఆదాయం పన్ను విధానాన్ని డీఫాల్ట్ టాక్స్ విధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించింది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులందరికీ కనీస పన్ను మినహాయింపు రూ.3 లక్షల వరకూ ఉంటుంది.
ఆదాయం పన్ను చట్ట ప్రకారం స్థూల పన్ను ఆదాయం కనీస మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
* ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బిల్లు రూ. లక్ష కంటే ఎక్కువగా ఉంటే..
* ఒక వ్యక్తి విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువా ఉంటే..
* విదేశీ ఆస్తుల నుంచి ఆదాయం వస్తున్నా..
* పన్ను చెల్లింపుదారుడు తన నైపుణ్య ఆదాయం రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉన్నా
* సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలు, అంతకన్నా ఎక్కువ. కరంట్ ఖాతాలో రూ.కోటి అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.