HDFC Twins M-Cap | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ (హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్) విలీనం ప్రకటించినప్పటి నుంచి ఈ రెండు సంస్థలకు గడ్డుకాలం ఏర్పడింది. ఈ నెల నాలుగో తేదీ నుంచి తొమ్మిది రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.67 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇప్పుడు బ్యాంక్ ఎం-క్యాప్ రూ.7,51,421 కోట్లు. కాగా, మార్టగేజ్ లెండర్ హెచ్డీఎఫ్సీ మరో రూ.91,595 కోట్లు కోల్పోగా, దాని ఎం-క్యాప్ 3,94,097 కోట్లకు పడిపోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.11.45 లక్షల కోట్లుగా ఉంది. ఈ నెల 4న అది రూ.14 లక్షల కోట్లు. రెండు సంస్థలు ఉమ్మడిగా రూ. 2.58 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.51 లక్షల కోట్ల కంటే ఎక్కువగా హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి.
ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్‌తో సమానంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వయం ఇన్వెస్టర్ల సంపద నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 17.94 శాతం, హెచ్డీఎఫ్సీ 19.41 శాతం పతనం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం ఎం-క్యాప్ కలిస్తే మూడో అత్యంత విలువైన సంస్థగా నిలుస్తుంది. టాప్‌లో రిలయన్స్ రూ.17,81,205 కోట్లతో మొదటి స్థానం, టీసీఎస్ రూ.12,89,011 కోట్లతో రెండో స్థానం.. తర్వాతీ స్థానంలో హెచ్డీఎఫ్సీ ద్వయం నిలుస్తాయి.